Thursday, October 11, 2012

మన ప్రాచీన దేవాలయాలు - సురుట పల్లి (చిత్తూరు జిల్లా)


Pallikondeswara Swamyమన రాష్ట్రంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి జిల్లా లోను ఇటువంటి పుణ్య స్థలాలు ఎన్నో ఉన్నాయి. చిత్తూరు జిల్లా లో అందరికి తెలిసిన పెద్ద గుళ్ళు - కాణిపాకం (వినాయక), అరగొండ (ఆంజనేయ),  తిరుమల-తిరుపతి (తిరుపతి పరిసర ప్రాంతాలలో పెక్కు ఆలయాలు),  శ్రీకాళహస్తి, మొదలైనవి.
ఇదే జిల్లా లో, తమిళనాడు సరిహద్దులో, నాగలాపురం సమీపంలో నున్న 'సురుట పల్లి' కూడా దర్స నీయ మైనది. తిరుపతి, కాళహస్తి, సూళ్ళూరుపేట నుండి  
సురుట పల్లికి బస్సు సౌకర్యం ఉన్నది.


ఈ క్షేత్ర గురించి:

ఈ క్షేత్రంలో మహాశివుడు శయనించి ఉంటారు (అందుకే తమిళం లో పల్లికొండేస్వర స్వామి అని అంటారు). క్షీర  సముద్రాన్ని మధించినపుడు ఉద్భవించిన హాలాహలాన్ని మ్రింగిన ఈశ్వరుడు ఇచ్చోటనే, పార్వతి దేవి ఒడిలో శిరస్సు నుంచి శయనించినట్లుగా స్థల పురాణం చెబుతుంది.    ఇక్కడ రాముల వారు, వాల్మీకి ప్రతిష్టించిన శివ లింగాలు ఉన్నయి. తరువాత  విజయనగర రాజైన హరిహరబుక్క రాయలు ఈ ఆలయాన్ని నిర్మించారుట. ప్రదోష పూజ ఇక్కడ ఎంతొ విశేషంగా చేస్తారు. 

ఇక్కడ దక్షిణామూర్తి అమ్మవారితో ఉండటం ఇంకో విశేషం. అందుకే అ విగ్రహాన్ని దంపతుదక్షిణామూర్తి అని కొలుస్తారు.  

కంచి పరమాచార్యుల వారికి ఈ క్షేత్రం మనిన ఎంతో ప్రీతిట.జూన్ 23, 2002 శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యం లో మహా కుంభాభిషేకం జరింగింది.

ఇతర వివరాలకు ...  సురుట పల్లి 




       

No comments:

Post a Comment