Tuesday, October 9, 2012

VEDA MANTRAM, వేదమంత్రాలు, స్తోత్రాలు, స్తుతులు ....

Venkata Sastryసకల దేవతా స్తుతులకు, వేదమంత్రాలకు నెలవైన Vedamantram వెబ్ సైట్ ను దర్శించండి. వేదమంత్రాలు శ్రవణ మాత్రం చేతే అలౌకిక ఆనందాన్ని, మనః శాంతిని కలిగిస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. సనాతన ధర్మ మార్గంలో తరించిన మన ప్రాచీన ఋషులు అందించిన అమూల్య సంపదలవంటి వేద మంత్రాలను, ఉపనిషత్తుల రహస్యాలను, అనేక స్తోత్రాలను, వేదమంత్రం.కాం  సుస్వరమైన గాత్రంతో, వీనుల విందుగా కమనీయ గానం చేసిన  బ్రహ్మశ్రీ   మారేపల్లి వెంకట శాస్త్రి  గారు  ఈ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు.
లోక కళ్యాణార్ధం, ఎటువంటి రుసుము లేకుండా కావలసిన స్తుతులను, ఉచితంగా  MP3 ఫైల్ గా డౌన్లోడ్ చేసుకొనే వీలు కల్పించిన బ్రహ్మశ్రీ   మారేపల్లి వెంకట శాస్త్రి  ప్రస్తుతం కాలిఫోర్నియా లో నివాసముంటున్నారు. శ్రీ శాస్త్రి గారు, మన రాష్ట్రంలో కొత్తగూడెం వద్ద వేద విద్యాలయాన్ని స్తాపించి, విద్యార్ధులకు ఉచిత వసతి కల్పించి, బోధిస్తున్నారు. దాని నిర్వహణకు ప్రభుత్వం నుండి కానీ ఇతర ఏ సంస్థలనుండి కాని ఏ విధమైన ఆర్ధిక సాయం లేదు. కావున సనాతన ధర్మం మీద గౌరవమున్న మన లాంటి వారు ఆ సంస్థకు ఆర్ధికంగా సహాయపడవచ్చు. 

శ్రీ శాస్త్రి గారి చిరునామా, ఈమెయిలు, ఇతర వివరాలకు వేదమంత్రం.కాం సందర్శించి తరించండి.


అదేవిధంగా , మనకు నచ్చిన  లేదా  అవసరమైన స్తోత్రాలను చదువుకోవడాని తెలుగు లిపిలో  కావాలంటే , ఈ క్రింద ఇచ్చిన కొన్ని వెబ్  సైట్స్ సందర్సిచవచ్చు.
ఇవి కాకుండా, గొప్ప పురాణ ప్రవచనాలను వినాలంటే అత్యుత్తమ వెబ్ పేజి - శ్రీ చాగంటి 

No comments:

Post a Comment